తెలుగు సినిమాలు.. తెలుగులో టైటిల్స్ ఉండవు అదే మ్యాజిక్కు..

తెలుగు సినిమాలు.. తెలుగులో టైటిల్స్ ఉండవు అదే మ్యాజిక్కు..

Published on Oct 21, 2024 12:00 AM IST

మన మాతృభూమిని మాతృభాషని ఎప్పటికీ మర్చిపోకూడదు అని పెద్దలు చెబుతూనే ఉంటారు కానీ ఇప్పుడు ఉన్న రోజుల్లో ఆధునికతకు దగ్గరవుతూ మన మూలాల్ని మర్చిపోతున్నాము అనేది వాస్తవం. ఈ క్రమంలో సినిమా లాంటి మేజర్ ఎంటర్టైన్మెంట్ అందించే మాధ్యమాలలో కూడా మాతృభాషని పక్కన పెడుతుండడం గమనార్హం. ఇపుడు అనేక భాషల్లో పాన్ ఇండియా స్థాయి చిత్రాలు వస్తున్నాయి.

కానీ దాదాపు సినిమాలు అన్నీ కూడా తెలుగులో టైటిల్ ని పోస్టర్స్ లో పొందు పరచడం అనేది బాగా తగ్గిపోయింది. దానికి చిన్న పెద్ద హీరోలు అని తేడా లేదు దాదాపు మన తెలుగు సినిమాలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పక్క రాష్ట్రాల్లో తమిళ్, కన్నడ భాషల వారికి తమ భాష అంటే ఎంతో ప్రీతి కానీ మన తెలుగు ప్రేక్షకుల విషయంలోనే అంతా భిన్నంగా కనిపిస్తుంది.

తెలుగు సినిమాలు ప్రపంచ సినిమా దగ్గర సత్తా చాటుతున్నాయి బాగానే ఉంది కానీ దానితో తెలుగు అక్షరాలకు ప్రాచుర్యం తగ్గిపోతుంది. ప్రస్తుతం కొందరు యువ దర్శకులు మినహా పలువురు స్టార్ దర్శకులు కూడా సినిమా ఆరంభపు టైటిల్స్ లో తెలుగు భాషలో వాటిని ఇవ్వడమే మానేశారు. ఇంకా తెలుగులోకి అనువదించి విడుదల చేస్తున్న తమిళ సినిమాల్లో మంచి జాగ్రత్తలు తీసుకుంటుండం గమనార్హం.

ప్రస్తుతం టాలీవుడ్ లో కనీసం పలు సినిమాలకి తెలుగులో పోస్టర్స్ కూడా పెద్దగా కనిపించడం లేదు అలా మారింది మన పరిస్థితి. పలు భాషల్లో విడుదల ఉన్నప్పటికీ ఎక్కువ ఇంగ్లీష్ లోనే టైటిల్స్, పోస్టర్స్ కనిపిస్తున్నాయి తప్పితే మన భాషలో మన అక్షరాలతో కనిపించేవి దాదాపు శూన్యం.

తెలుగు సినిమా నుంచి సినిమాలు చేస్తూ మనమే టైటిల్స్ ని తెలుగులో ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నామంటే దీనికి మించిన అథమ స్థాయి ఇంకొకటి లేదు.. మరి దీనిపై తెలుగు సినీ పరిశ్రమ దృష్టి పెడుతుందో లీక తెలుగు ఆడియెన్స్ ఏం పెట్టినా చూస్తారు అని ఊరుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు