పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న ‘ది రాజా సాబ్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమాలో నటించనున్నాడు. ఇక ఈ సినిమా తరువాత సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా చేయనున్నాడు.
సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే సినిమాలో నటించబోతున్నట్లు గతంలోనే అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి ఓ విషయాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా మరోసారి కన్ఫమ్ చేశాడు. ఈ సినిమా ఓ పవర్‌ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుందని గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, ఇప్పుడు ఇదే విషయాన్ని ఆయన తాజాగా కన్ఫమ్ చేశాడు. ‘పొట్టేల్’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సందీప్ రెడ్డి వంగా ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్‌తో ఆయన చేయబోయే సినిమా ఓ పోలీస్ స్టోరి అని ఆయన స్వయంగా తెలిపారు.
దీంతో మరోసారి ‘స్పిరిట్’ మూవీపై అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు. సందీప్ రెడ్డి వంగా లాంటి డైరెక్టర్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్‌ని ఎంత వయొలెంట్‌గా చూపిస్తాడా అని వారు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరంలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.