టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘పొట్టేల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఒకింత మంచి బజ్‌ని క్రియేట్ చేసిందని చెప్పాలి. ఈ సినిమా టీజర్ మొదలుకొని, పోస్టర్స్, ట్రైలర్ వరకు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ సినిమా ట్రైలర్‌కు విశేష స్పందన రావడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో నిర్వహిస్తున్నారు.
యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ ‘పొట్టేల్’ సినిమాను పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించగా సాహిత్ మోత్కూరి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. రా అండ్ రస్టిక్ ఫ్లేవర్‌తో ఈ సినిమా తెరకెక్కడం.. ఓ చక్కటి మెసేజ్ కూడా ఇందులో ఉందని చిత్ర యూనిట్ చెప్పడంతో ఈ సినిమాపై సినీ సర్కిల్స్‌లోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక తాజాగా నిర్వహించిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘పొట్టేల్’ సినిమాను తాను చూశానని.. ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇలా సందీప్ రెడ్డి లాంటి డైరెక్టర్ ‘పొట్టేల్’ సినిమాకు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ మరింత పెరిగింది. అక్టోబర్ 25న థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఆసక్తిని చూపుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి