“జైలర్ 2” పై ఇంట్రెస్టింగ్ బజ్

“జైలర్ 2” పై ఇంట్రెస్టింగ్ బజ్

Published on Oct 22, 2024 7:06 AM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వేట్టయన్” డీసెంట్ టాక్ అండ్ వసూళ్లు అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తన గత చిత్రం లాల్ సలాం కంటే కొంచెం బెటర్ గా పెర్ఫామ్ చేసింది. అయితే దీనికి ముందు రజినీకాంత్ బిగ్గెస్ట్ హిట్ “జైలర్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

అయితే ఈ సినిమాకి సీక్వెల్ ని కూడా దర్శకుడు ఫిక్స్ చేశాడు. మరి ఈ సీక్వెల్ పై ఆసక్తికరమైన విషయాలు కూడా బయటకి వస్తున్నాయి. అలా లేటెస్ట్ గా మరో టాక్ వినిపిస్తుంది. దీనితో ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కి ధనుష్ కనిపిస్తాడు అన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి గతంలో కూడా ధనుష్, రజినీకాంత్ కలయికలో ఓ సినిమాకి స్క్రీన్ షేర్ చేసుకుంటారు అని టాక్ ఉంది. మరి అది ఇదేనా అని వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు