బాలయ్య 109″ ఈ రెండు రిలీజ్ డేట్స్ లో ఒకటి ఫిక్స్!?

బాలయ్య 109″ ఈ రెండు రిలీజ్ డేట్స్ లో ఒకటి ఫిక్స్!?

Published on Oct 22, 2024 8:03 AM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్న భారీ యాక్షన్ సినిమా కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా రాబోతుండగా భారీ హైప్ అయితే దీనిపై నెలకొంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది ఈ దీపావళి కానుకగా క్రేజీ అప్డేట్స్ కూడా రాబోతున్నాయి.

అయితే ఈ సినిమా విడుదల వచ్చే ఏడాది సంక్రాంతి అని కూడా టాక్ ఉంది. అయితే సంక్రాంతి బరిలో ఎప్పుడు ఈ సినిమా అనే దానికి బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం రెండు డేట్స్ అయితే పరిశీలనలో ఉన్నాయట. దీనితో జనవరి 9 లేదా 12 తేదీలని మేకర్స్ చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి వీటిలో ఏ డేట్ కి సినిమా రానుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు