ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న “సత్యం సుందరం”.. కానీ

ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న “సత్యం సుందరం”.. కానీ

Published on Oct 22, 2024 1:11 PM IST

ఓటిటిలో ముందే వచ్చేస్తున్న “సత్యం సుందరం”.. కొత్త డేట్ ఇదేరీసెంట్ గా మన దక్షిణాది సినిమా దగ్గర విడుదలకి వచ్చి తమిళ్ సహా తెలుగులో మంచి హిట్ గా నిలిచిన చిత్రాల్లో టాలెంటెడ్ హీరో కార్తీ అలాగే నటుడు అరవింద స్వామి కాంబినేషన్ లో దర్శకుడు సి ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఫీల్ గుడ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా “సత్యం సుందరం” కూడా ఒకటి.

మరి తెలుగు సహా తమిళ ప్రేక్షకుల మనసులు కదిలించిన ఈ సినిమా ఇపుడు ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యింది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా నేడు నెట్ ఫ్లిక్స్ వారు ఖరారు చేశారు.అయితే ఈ సినిమాని వచ్చే వారం అక్టోబర్ 27 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్టు అనౌన్స్ చేశారు కానీ తర్వాత నెట్ ఫ్లిక్స్ ఈ పోస్ట్ ని తొలగించింది.

అయితే ఇప్పుడు దీనిపై కొత్త అప్డేట్ వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ వారు ఇచ్చిన పాత డేట్ కాకుండా కొంచెం ముందే ఈ సినిమా వచ్చేస్తుంది. కొత్త డేట్ గా అయితే ఈ అక్టోబర్ 25 కి లాక్ చేశారు. సో ఈ బ్యూటిఫుల్ సినిమా ముందే రాబోతుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు