“మట్కా” నుంచి రెండో సాంగ్ కి డేట్ ఫిక్స్!

“మట్కా” నుంచి రెండో సాంగ్ కి డేట్ ఫిక్స్!

Published on Oct 22, 2024 6:30 PM IST

మెగా యంగ్ అండ్ డెడికేట్ హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “మట్కా” కోసం తెలిసిందే. మరి టాలెంటెడ్ దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ గ్యాంగ్ స్టర్ అండ్ గ్యాంబ్లింగ్ డ్రామాగా దీనిని భారీ హంగులతో తెరకెక్కించారు. అయితే ఇప్పుడు వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా మంచి బజ్ ని అయితే రేకెత్తించింది. అలాగే సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ కూడా బాగానే ఆకట్టుకుంది.

ఇక మేకర్స్ లేటెస్ట్ గా సినిమా రెండో సాంగ్ ని అనౌన్స్ చేసేసారు. మరి వరుణ్ తేజ్ అండ్ కొంతమంది లేడీస్ పై తస్సాదియ్యా అంటూ సాగే సాంగ్ ని ఈ అక్టోబర్ 24న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. మరి ఈ పోస్టర్ మూడ్ చూస్తుంటే వరుణ్ తేజ్ రోల్ పై సాగేలా కనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా నవంబర్ 14న సినిమా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు