విజయ్ మరో సినిమా ఓకే చేశాడా?

విజయ్ మరో సినిమా ఓకే చేశాడా?

Published on Oct 22, 2024 9:00 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా ఇప్పుడు దర్శకుడు హెచ్ వినోద్ తో తన కెరీర్ లాస్ట్ సినిమా అంటూ తన కెరీర్ 69వ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా యంగ్ హీరోయిన్ మమిత బైజు కీలక పాత్ర చేస్తుంది. అయితే ఈ సినిమా మన టాలీవుడ్ సాలిడ్ హిట్ చిత్రం “భగవంత్ కేసరి” కి రీమేక్ అన్నట్టుగా స్ట్రాంగ్ రూమర్స్ ఉన్నాయి.

ఇక ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా ఈ సినిమా తర్వాత విజయ్ సినిమాలు ఆపేసినట్టేనా పలు సీక్వెల్స్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ప్రశ్న గానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలు కాకుండా ఇంకో లాస్ట్ సినిమాకి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ పలు రూమర్స్ కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి ఆ సినిమా కూడా విజయ్ కి ఎన్నో భారీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు అట్లీతో అన్నట్టుగా వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు