“కేజీయఫ్ 3” పై యష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

“కేజీయఫ్ 3” పై యష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

Published on Oct 23, 2024 9:04 AM IST


కన్నడ సినిమా దగ్గర సెన్సేషనల్ హిట్ సినిమా ఫ్రాంచైజ్ “కేజీయఫ్” కోసం అందరికీ తెలిసిందే. మరి రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ట్రెండ్ సెట్ చేసాయి. ఇక ఈ రెండు భారీ హిట్ సినిమాలకి పార్ట్ 3 ని కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేయగా ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుంది అని ప్రశాంత్ నీల్ కూడా కన్ఫర్మ్ చేసాడు.

అయితే ఇప్పుడు పార్ట్ 3 పై యష్ మాట్లాడ్డం జరిగింది. కేజీయఫ్ చాప్టర్ 3 చేస్తానని ఇప్పుడు చేస్తున్న టాక్సిక్ అలాగే బాలీవుడ్ లో రామాయణ సినిమాల తర్వాత చేసేది ఆ సినిమానే అంటూ తాను రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. దీనితో ఈ సినిమాలు చేసిన పిదప యష్ ఈ బిగ్గెస్ట్ సీక్వెల్ ని చేయడం అయితే కన్ఫర్మ్ అని తేలిపోయింది. మరి ప్రస్తుతం అయితే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్, ప్రభాస్ లతో కూడా సినిమాలు చేయాల్సి ఉంది. మరి అవి పూర్తయ్యాక యష్ తో స్టార్ట్ చేసేందుకు ఎంత సమయం పడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు