ట్విస్ట్.. సీన్ లోకి “సలార్ 2” అప్డేట్..

ట్విస్ట్.. సీన్ లోకి “సలార్ 2” అప్డేట్..

Published on Oct 23, 2024 8:30 PM IST

ప్రస్తుతం సోషల్ మీడియా అంతా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు ఏదన్నా ఉంది అంటే అది మన టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసమే అని చెప్పాలి. పాన్ ఇండియా సినీ ప్రముఖులు అలాగే నిర్మాణ సంస్థలు ప్రభాస్ కి తమ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈరోజు ప్రభాస్ సినిమాల్లో మేజర్ గా ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమా నుంచి మినహా మిగతా సినిమాల అప్డేట్స్ పెద్దగా రాలేదు.

కానీ ఊహించని విధంగా సర్ప్రైజింగ్ అప్డేట్ సలార్ పార్ట్ 2 పై బయటకి వచ్చింది. మేకర్స్ సలార్ 2 ని ప్రభాస్ పై ఒక 20 రోజుల షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారని ఇది మెయిన్ గా ప్రభాస్ పై షెడ్యూల్ అని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ కూడా ఈ 20 రోజులు పాల్గొననున్నాడట. ఇది మాత్రం ఒక ఊహించని ట్విస్ట్ అప్డేట్ అనే చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాలో పృథ్వి రాజ్ సుకుమారన్ కూడ సాలిడ్ రోల్ లో నటిస్తుండగా హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు