టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఆమె నటించిన లాస్ట్ మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక అనుష్క నెక్స్ట్ ఎలాంటి మూవీతో వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే, అనుష్క సైలెంట్‌గా రెండు సినిమాలను పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. మలయాళంలో తన తొలి చిత్రంగా ‘కథనార్’ అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో ‘ఘాటి’ అనే సినిమాను కూడా చేస్తోంది. ఇప్పుడు ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తయ్యిందని.. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్నాయని తెలుస్తోంది.
త్వరలోనే ‘ఘాటి’ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.