నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ తన తొలి సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు. ‘హను-మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినప్పటి నుండి నందమూరి అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
అయితే, ఇప్పుడు ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగిశాయని.. అందుకే ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న లాంచ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. డిసెంబర్ 2న క్లాప్ కొట్టి ఈ సినిమాను స్టార్ట్ చేసి రెగ్యులర్ షూట్‌కు వెళ్లేందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ షెడ్యూల్ రెడీ చేస్తున్నాడట.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రషా తథానీ హీరోయిన్‌గా పరిచయం కానుందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. మరి నిజంగానే ఈ సినిమాను డిసెంబర్ 2న స్టార్ట్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.