‘కంగువా’ కోసం ‘అన్‌స్టాపబుల్‌’ ప్రమోషన్స్!

‘కంగువా’ కోసం ‘అన్‌స్టాపబుల్‌’ ప్రమోషన్స్!

Published on Oct 24, 2024 3:00 AM IST

తమిళ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువా’ చిత్రం నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శివ డైరెక్ట్ చేస్తుండగా, ఇప్పటికే ఈ చిత్రం పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేస్తూ చిత్ర యూనిట్ బిజీగా ఉంది.

ఈ చిత్రాన్ని తెలుగులో ప్రమోట్ చేసేందుకు ‘కంగువా’ టీమ్ హైదరాబాద్ రానుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 24న ఓ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు మేకర్స్. అయితే, దీంతో పాటు స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్-4’లోనూ ‘కంగువా’ టీమ్ సందడి చేయనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూట్ అక్టోబర్ 24న జరగనుందని తెలుస్తోంది.

ఇలా తెలుగులోనూ భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేసిన ‘కంగువా’ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు