పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు మారుతీతో చేస్తున్న అవైటెడ్ హారర్ థ్రిల్లర్ సినిమా “ది రాజా సాబ్” కూడా ఒకటి. మరి మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ నిన్న ప్రభాస్ బర్త్ డే కానుకగా ఒక ఊహించని కొత్త లుక్ సహా దానిపై ఇంట్రెస్టింగ్ మోషన్ పోస్టర్ టీజర్ ని కూడా వదిలారు.
మరి ఈ పోస్టర్ అయితే అదిరిపోగా ఆ వీడియో టీజర్ కి రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ నమోదు అయినట్టుగా తెలుస్తుంది. మన టాలీవుడ్ నుంచి ఇప్పుడు వరకు వచ్చిన ఎన్నో మోషన్ పోస్టర్ టీజర్ లను మించి దీనికి ఏకంగా 8.3 మిలియన్ వ్యూస్ 24 గంటల్లో వచ్చేసాయి. దీనితో ఆల్ టైం హైయెస్ట్ రెస్పాన్స్ తో ది రాజా సాబ్ అయితే రికార్డుల వేట షురూ చేసాడని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
#TheRajaSaab ???????? Breaking it down ????⭐️ pic.twitter.com/eBe8d1sZoL
— thaman S (@MusicThaman) October 24, 2024