ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల అత్యాచార ఆరోపణలపై అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయన వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన ఓ లేడీ కొరియోగ్రఫర్ ఈ కేసు పెట్టడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఇక అటుపై ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం.. ఆయన బెయిల్ కోసం అప్లై చేస్తే కోర్టు తిరస్కరించింది.
గత కొద్ది రోజులుగా ఆయన పోలీసు కస్టడీలో ఉంటున్నారు. అయితే, తాజాగా ఆయనకు తెలంగాణ హై కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. గతంలో బెయిల్ కోసం జానీ మాస్టర్ అప్లై చేసుకుంటే, రంగారెడ్డి కోర్టు దాన్ని తిరస్కరించింది. ఈ పరిణామంతో ఆయనకు అనౌన్స్ చేసిన జాతీయ బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డును కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
ఇలా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌కి బెయిల్ రావడంతో ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఆయనపై ఇన్వెస్టిగేషన్, లీగల్ ప్రొసీడింగ్స్ కొనసాగుతాయని కోర్టు తెలిపింది.