టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీ ‘పుష్ప-2’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తు్న్నారు. ఇక క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చిత్ర నిర్మాతలు నేడు మీడియాతో పంచుకున్నారు.
‘పుష్ప-2’ చిత్రాన్ని డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేగాక ఈ సినిమా ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేస్తున్నామని.. అలాగే నవంబర్ నెలలో ‘పుష్ప-2’ మేనియా కొనసాగుతుందని వారు తెలిపారు. నవంబర్‌లో ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలతో పాటు ట్రైలర్‌ని కూడా రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో అభిమానులు ఇక ‘పుష్ప-2’ ఫీవర్‌తో ఊగిపోయేందుకు సిద్ధమవుతున్నారు.
అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, అజయ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.