రజినీతో లోకేష్ ముందు అనుకున్న కథ వేరా!?

రజినీతో లోకేష్ ముందు అనుకున్న కథ వేరా!?

Published on Oct 25, 2024 9:02 AM IST


ప్రస్తుతం మన సౌత్ నుంచి ఉన్న పలు క్రేజీ కాంబినేషన్ చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే యంగ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో చేస్తున్న సాలిడ్ మల్టీస్టారర్ చిత్రం “కూలీ” కూడా ఒకటి. మరి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని లోకేష్ శరవేగంగా ఆయా నటులతో తెరకెక్కిస్తున్నాడు.

అయితే రజినీ లోకేష్ కాంబినేషన్ అనగానే ఒక్కసారిగా అంచనాలు ఊహించని రీతిలో పెరిగాయి. అయితే ఈ సినిమా విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఇపుడు వినిపిస్తుంది. దీనితో అసలు రజినీకాంత్ కోసం లోకేష్ ముందు అనుకున్న కథే వేరు అట. కానీ అది డెవలప్ చేసే సమయంలో లోకేష్ కొంచెం ప్రెజర్ ఫీల్ అవ్వడం మూలాన అది కాకుండా కూలీ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ స్క్రిప్ట్ కి కూడా లోకేష్ కొంచెం ఎక్కువ సమయమే తీసుకున్నాడు. అలాగే గతంలో కూడా రజినీకి స్క్రిప్ట్ రాయడం చిన్న విషయం కాదని అది ఒత్తిడితో కూడుకున్నదే అని తెలిపాడు. ఇపుడు ఈ టాక్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు