మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ప్రెస్టీజియస్ మూవీ ‘కన్నప్ప’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తుండగా భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే, ఈ సినిమాను ఈ ఏడాది చివరినాటికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను షురూ చేసేందుకు వారు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా కన్నప్ప టీమ్ తాజాగా ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనానికి బయల్దేరారు. తొలుత వారు ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ను సందర్శించారు.
తమ సినిమాను ఆ మహాశివుడు ఆశీర్వదించాలని వారు ఈ సందర్భంగా కోరినట్లుగా మంచు విష్ణు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఇక తన తండ్రి డా.మోహన్ బాబు కూడా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనానికి రావడం సంతోషంగా ఉందని మంచు విష్ణు పేర్కొన్నారు.
Started the journey of the 12 Jyotirlingas. First one to visit is the holy #Kedarnathॐ. Prayed for #Kannappa???? and the journey it's going to take. #HarHarMahadevॐ pic.twitter.com/5ddgBuV0Do
— Vishnu Manchu (@iVishnuManchu) October 25, 2024