ఈటీవీ విన్‌లో ట్రెండింగ్‌లో ‘పైలం పిలగా’ చిత్రం

ఈటీవీ విన్‌లో ట్రెండింగ్‌లో ‘పైలం పిలగా’ చిత్రం

Published on Oct 26, 2024 8:27 AM IST

ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుండి ప్రశంశలు దక్కించుకొని డీసెంట్ సక్సెస్ పొందిన ‘పైలం పిలగా’ సినిమాకు ఇప్పుడు ఓటిటిలోనూ మంచి స్పందన దక్కుతోంది. అక్టోబర్ 10 నుండి ఈటీవి విన్ ద్వారా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. మెలోడియస్ పాటలు, ఆకట్టుకునే డైలాగ్స్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.

పల్లెలు, ప్రకృతి, పర్యావరణం, వ్యవసాయం, ఉపాధి, వలసలు, ప్రభుత్వ ఉద్యోగుల అలసత్వం, లంచగొండితనం వంటి లోతైన అంశాలను ఈ సినిమాలో వ్యంగంగా మలిచారు. దీంతో పాటు సెకండ్ హాఫ్ మంచి మ్యూజికల్ నెరేషన్లో భావోద్వేగాలు పండటంతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్‌లో ‘పైలం పిలగా’ను యాడ్ ఫిలిం డైరెక్టర్ ఆనంద్ గుర్రం దర్శకత్వంలో రామకృష్ణ బొద్దుల, ఎస్.కే.శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు.

ఈ సినిమాలో డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. యశ్వంత్ నాగ్ సంగీతం అందించిన ఈ సినిమాకు కెమెరా వర్క్ సందీప్ బద్దుల అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు