‘రాజా సాబ్’లో మూడు.. నిజంగా ప్రభాస్ రిస్క్ చేస్తాడా..?

‘రాజా సాబ్’లో మూడు.. నిజంగా ప్రభాస్ రిస్క్ చేస్తాడా..?

Published on Oct 27, 2024 7:03 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రబాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా హార్రర్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఇక ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఈ సినిమాలో ప్రభాస్ ఎన్ని పాత్రలు చేస్తున్నాడు.. అనే విషయంపై అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్ చూస్తే ఇందులో ప్రభాస్ రెండు పాత్రల్లో నటిస్తున్నాడని.. ఒకటి యంగ్ అండ్ వింటేజ్ ప్రభాస్.. మరోటి అతడి తాత పాత్రలో ఉన్న ప్రభాస్.. అని అభిమానులు చర్చించుకుంటున్నారు. కానీ, సోషల్ మీడియాలో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమాలో మొత్తం ముగ్గురు ప్రభాస్‌లు ఉంటారని.. తాత, మనవడు కాకుండా.. దెయ్యం పాత్రలో కూడా ప్రభాస్ కనిపిస్తాడనే టాక్ జోరుగా చక్కర్లు కొడుతోంది.

మరి నిజంగానే ప్రభాస్ ఈ సినిమాలో మూడు పాత్రల్లో నటిస్తాడా.. తాత, మనవడి పాత్ర అయితే పర్వాలేదు.. కానీ దెయ్యం పాత్రకు ప్రభాస్ ఒప్పుకుంటాడా.. ఒకవేళ ఆయన ఒప్పుకుంటే రిస్క్ చేసినట్లు అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు రాజా సాబ్ మూవీలో ప్రభాస్ పాత్రలు ఎన్ని..? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు