నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే, ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. అయితే, ఈ సీక్వెల్ స్టార్టింగ్ సీక్వెన్స్ పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ‘అఖండ 2’ కథ యూఎస్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ తో ఓపెన్ అవుతుందని, ప్రగ్యా జైస్వాల్ పాత్ర హెల్త్ ట్రీట్మెంట్ కోసం రెండో బాలయ్య పాత్ర యూఎస్ వెళ్లాల్సి వస్తోందని, అక్కడ తెలుగు వాళ్ళ పై ఎటాక్ జరిగే క్రమంలో బాలయ్య పాత్ర వారిని సేవ్ చేస్తోందని తెలుస్తోంది.
ఈ యాక్షన్ సీక్వెన్సే ‘అఖండ 2 – తాండవం’ స్టార్టింగ్ సీక్వెన్స్ అని తెలుస్తోంది. కాగా ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతునట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి.