‘SDT18’కి ‘కాంతార’ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ !

‘SDT18’కి ‘కాంతార’ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ !

Published on Oct 27, 2024 1:00 PM IST

రోహిత్ కేపీ డైరెక్షన్‌ లో యంగ్ హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా తన 18వ సినిమాని ప్రస్తుతం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ సినిమా అనౌన్సమెంట్ నాటి నుంచి మంచి హైప్ ని సెట్ చేసుకుంది. ఇక మేకర్స్ ఈ చిత్రం నుంచి నేడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఓ గ్లింప్స్‌ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈయన కాంతార, విరూపాక్ష సినిమాలకు అందించిన మ్యూజిక్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ సౌత్ నటి ఐశ్వర్య లెక్ష్మి నటిస్తోంది. ఈ సినిమాలో ఈమె వసంత అనే పాత్రలో కనిపించనుంది. ఇక ఈ భారీ చిత్రానికి హనుమాన్ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహిస్తుండగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని ఈ చిత్రం జరుపుకుంటుంది. మొత్తానికి ‘SDT18కు ‘కాంతార’ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు