భారీ యాక్షన్ షూట్ లో “ఓజి”.. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్

భారీ యాక్షన్ షూట్ లో “ఓజి”.. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్

Published on Oct 28, 2024 9:00 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “ఓజి” కోసం అందరికీ తెలిసిందే.. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. అయితే ఈ సినిమా బ్యాలన్స్ షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది. పూర్తిగా నైట్ ఎఫెక్ట్ లో స్టార్ట్ అయ్యిన ఈ సినిమా పవన్ లేని సీన్స్ తో శరవేగంగా పూర్తవుతుంది.

అయితే ఇపుడు ఓ భారీ యాక్షన్ సీన్ ని తాము చేస్తున్నట్టుగా సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ అప్డేట్ అందించారు. అలాగే సుజీత్ సహా సంగీత దర్శకుడు థమన్ తో కలిసి ఉన్న ఓ పిక్ ని షేర్ చేసి తెలిపారు. ఇక ఈ చిత్రంపై మరో అప్డేట్ గా నెక్స్ట్ సాంగ్ ప్లానింగ్స్ కోసం తాము మాట్లాడుకుంటున్నట్టుగా ఆ పిక్ తో తెలిపారు. ఇలా మొత్తానికి అయితే ఓజి షూట్ ఫుల్ స్వింగ్ లో కొనసాగుతుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు