అక్టోబర్ 29న ‘ధూం ధాం’ పెయిడ్ ప్రీమియర్ షో.. ఎక్కడంటే..?

అక్టోబర్ 29న ‘ధూం ధాం’ పెయిడ్ ప్రీమియర్ షో.. ఎక్కడంటే..?

Published on Oct 28, 2024 8:52 AM IST

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 8వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ చేశారు మేకర్స్.

ఈ నేపథ్యంలో అక్టోబర్ 29న విశాఖపట్నం మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్‌లోని ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లో “ధూం ధాం” సినిమా పెయిడ్ ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. రాత్రి 7.30 గంటలకు ఈ పెయిడ్ ప్రీమియర్ షో ప్రారంభం కానుంది. “ధూం ధాం” సినిమా నుంచి రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. రీసెంట్‌గా డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా రిలీజ్ చేసిన టీజర్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ పై క్రేజ్ ఏర్పడుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు