ప్రతిష్టాత్మకమైన ఏఎన్నార్ నేషనల్ అవార్డు ప్రదానోత్సవంలో అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఏఎన్నార్ జాతీయ పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. ఈ వేడుక నిన్న కన్నుల పండువగా జరిగింది. ఐతే, ఈ అవార్డు ప్రదానోత్సవంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. ‘‘ఈ వేడుక పై నా ద్వారా చిరంజీవికి ఏఎన్నార్ జాతీయ అవార్డును అందించడం చాలా సంతోషంగా, ఓ గౌరవంగా భావిస్తున్నాను. నాపట్ల చిరంజీవి చూపే ప్రేమాభిమానాలకు, స్నేహభావానికి.. ఆతిథ్యానికి చాలా కృతజ్ఞతలు’ అని అమితాబ్ చెప్పుకొచ్చారు.
అమితాబ్ ఇంకా మాట్లాడుతూ.. ‘సైరా నరసింహారెడ్డి’, ‘కల్కి 2898ఎ.డి’ సినిమాలతో నన్ను తెలుగు ఇండస్ట్రీలో ఒక భాగం చేశారు. ఇప్పుడు నన్ను నేను తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటుణ్ని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. చిరంజీవి, నాగార్జున, నాగ్ అశ్విన్.. ఇకపై మీ నుంచి రాబోయే సినిమాల్లోనూ నాకు అవకాశాలు ఇవ్వడాన్ని మర్చిపోవద్దు’ అంటూ అమితాబ్ బచ్చన్ కామెంట్స్ చేయడం విశేషం. ఈ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ.. ‘‘నాన్న శత జయంతి వేడుకల సందర్భంగా ఏఎన్నార్ జాతీయ పురస్కారాన్ని చిరంజీవికి అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు.
.