‘క’ మూవీ ఫెయిల్ అయితే సినిమాలకు గుడ్ బై – కిరణ్ అబ్బవరం

‘క’ మూవీ ఫెయిల్ అయితే సినిమాలకు గుడ్ బై – కిరణ్ అబ్బవరం

Published on Oct 30, 2024 1:00 AM IST

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘క’ ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను సందీప్, సుజిత్‌లు కలిసి డైరెక్ట్ చేస్తుండగా ఓ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీగా ఇది రానుంది. ఇక ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం ఓ ఇంట్రెస్టింగ్ గెటప్‌లో కనిపిస్తూ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తు్న్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

అయితే, తాజాగా ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అక్కినేని నాగచైతన్య గెస్టుగా వచ్చారు. ఈ వేడుకలో హీరో కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ స్పీచ్ ఇచ్చాడు. ఈ స్పీచ్‌లో ‘క’ మూవీపై తన కాన్ఫిడెన్స్ ఏమిటో కూడా చూపెట్టాడు. ‘క’ మూవీ ప్రేక్షకులకు నచ్చకుండా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయితే.. తాను సినిమాలు చేయడం మానేస్తానని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం.

ఈ సినిమాపై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటే ఆయన ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తాడు అని ప్రేక్షకులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో తన్వీ రామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు