ఈ దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న అవైటెడ్ సినిమా “క” కూడా ఒకటి. మరి మొత్తం ఇద్దరు దర్శకులు పని చేసిన ఈ సినిమా టీజర్ నుంచే మంచి బజ్ ని సంతరించుకుంది.
ఇలా అక్కడ నుంచే గ్యాప్ తీసుకున్నా ఈసారి కిరణ్ అబ్బవరం మంచి ప్రయత్నంతో వస్తున్నాడు అనే టాక్ లో ఉంది. అయితే రీసెంట్ ట్రైలర్ తో మరింత హైప్ కూడా నెలకొంది కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం కిరణ్ అబ్బవరం స్పీచ్ చూసి చాలా మంది షాకయ్యారు. తనపై ట్రోల్స్ కోసం స్పందించిన కిరణ్ ఈ ట్రోల్స్ విషయాన్ని తనపై పాజిటివ్ గా మార్చుకున్నాడని చెప్పొచ్చు.
దీనితో సోషల్ మీడియాలో చాలా మంది డెఫినెట్ గా “క” సినిమా చూస్తాం అని చెబుతున్నారు. కిరణ్ అబ్బవరం చాలా పరిపక్వతతో, క్లారిటీగా మాట్లాడుతున్నాడు అని క సినిమా కూడా వర్కవుట్ అయ్యేలానే అనిపిస్తుంది అని చాలా మంది అనుకుంటున్నారు. మరి వీటితో అయితే తన సినిమాపై ఇపుడు పాజిటివ్ ఏర్పడింది. మరి ఈ సినిమా అనుకున్న అంచనాలు రీచ్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.