కిరణ్ విషయంలో నిస్వార్థ కామెంట్స్.. మరో మెట్టు ఎక్కేసిన చైతూ

కిరణ్ విషయంలో నిస్వార్థ కామెంట్స్.. మరో మెట్టు ఎక్కేసిన చైతూ

Published on Oct 30, 2024 9:03 AM IST


మన టాలీవుడ్ లో ప్రెజెంట్ షైనింగ్ యంగ్ హీరోస్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఒకడు. మరి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్ లో సాలిడ్ డెబ్యూ తాను అందుకున్నాడు. రాజా వారు రాణి గారు, ఎస్ఆర్ కల్యాణమండపం, వినరో భాగ్యము విష్ణుకథ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న తాను పలు ట్రోల్స్ కూడా ఎదుర్కోక తప్పలేదు.

ఇలా గ్యాప్ తీసుకొనే సాలిడ్ సబ్జెక్టుతో వస్తున్న సినిమానే “క”. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ కి అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య చేసిన కామెంట్స్ హైలైట్ గా మారాయి. కిరణ్ చేసిన వర్క్ కోసం నేను తెలుసుకున్నాను అని కిరణ్ లాంటి వారు అంటే నాకు ఎంతో గౌరవం, ట్రైలర్ చూసిన వెంటనే ఎంతో నచ్చింది తర్వాత కిరణ్ కాల్ చేసి అన్నా నువ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తావా అని అడిగితే నాకు ఎంతో గర్వంగా అనిపించింది అని నాగ చైతన్య తెలిపాడు.

అలాగే నేను ఒక బ్యాక్గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి వచ్చాను, కిరణ్ చూసిన కష్టాలు లాంటివి నాకు తెలియదు, కిరణ్ వర్క్ ని నేను నెంబర్ 1 ఫ్యాన్ అంటూ చేసిన కొన్ని నిస్వార్ధపూరిత కామెంట్స్ అయితే చైతూని డెఫినెట్ గా మరో మెట్టు ఎక్కించాయని చెప్పాలి. మరి ఈ కామెంట్స్ తో అయితే కిరణ్ అబ్బవరం మరింత ఎమోషనల్ అయ్యాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు