బుకింగ్స్ డోర్ ఓపెన్ చేస్తున్న ‘పుష్పరాజ్’

బుకింగ్స్ డోర్ ఓపెన్ చేస్తున్న ‘పుష్పరాజ్’

Published on Oct 31, 2024 11:01 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప-2’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తనదైన మార్క్‌తో తెరకెక్కించగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై సాలిడ్ అంచనాలను క్రియేట్ చేశాయి.

ఇక ఈ సినిమా నుండి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప 2 చిత్రం నుండి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన టికెట్ బుకింగ్స్‌ను నవంబర్ 5న ఓపెన్ అవుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌తో వారు ఈ విషయాన్ని రివీల్ చేశారు.

దీంతో పుష్ప-2 చిత్రానికి సంబంధించిన టికెట్లను బుక్ చేసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కి రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు