మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన సెన్సేషనల్ పాన్ ఇండియా సినిమా “దేవర” కోసం తెలిసిందే. మరి తారక్ నుంచి ఎన్నో ఏళ్ళు తర్వాత సోలోగా వచ్చిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ నంబర్స్ నే సెట్ చేసి ఇపుడు దాదాపు థియేట్రికల్ రన్ ని అయితే ముగించుకుంది.
ఇక నెక్స్ట్ సినిమా ఓటిటి ఎంట్రీ ఒక్కటి కావాల్సి ఉంది. మరి దీనిపై ఇటీవల పలు డేట్స్ కూడా వినిపించాయి. వీటితో ఈ సినిమా నవంబర్ 8న సౌత్ భాషల్లో హిందీలో 22న వస్తుంది అన్నట్టుగా వినిపించింది. అయితే ఇపుడు సమయం దగ్గరకి వస్తుండడంతో ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.
ఈ 8 డేట్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటిటి హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో ఈ సినిమా 8న వచ్చేలా ఉంటే ఈ కొన్ని రోజుల్లోనే అనౌన్సమెంట్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. నెట్ ఫ్లిక్స్ నుంచే అఫీషియల్ గా ఈ వీక్ లో రానున్నట్టుగా టాక్. మరి దేవర ఓటిటి ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.