తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసేలా సిల్వర్ స్క్రీన్‌పై మునుపెన్నడూ చూడని థ్రిల్లింగ్ సబ్జెక్టుతో రాబోతున్న చిత్రం ‘M4M’ (Motive For Murder). తెలుగుతో పాటు ఐదు ఇతర భాషలలో దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఒకే ఒక కిల్లర్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ పోస్టర్ డిజైన్, M4M టైటిల్ హాలీవుడ్ సినిమా రేంజ్లో కనిపిస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ..కంటెంట్ ఈజ్ ద కింగ్ అనే ప్రిన్సిపల్‌తో M4M (Motive For Murder) మూవీని తెరకెక్కించినట్టు చెప్పారు. సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్టుతో తెరకెక్కించిన ఈ చిత్రం ఇండస్ట్రీలో ఏ ఫెదర్ ఇన్ క్రౌన్ అవ్వబోతోందన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ జోనర్లో ఇదొక కలికితురాయి నిలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే M4M ను ఐదు భాషలలో వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నామన్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు అమెరికాలోనూ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయని చెప్పారు. వసంత్ అందించిన మ్యూజిక్, ఆనంద్ పవన్ చేసిన ఎడిటింగ్, సంతోష్ షానమోని కెమెరా పనితనం.. వంటి తమ టీమ్ వర్క్ హాలీవుడ్ రేంజ్లో వచ్చాయ ప్రశంసించారు.