సమీక్ష : అప్పుడో ఇప్పుడో ఎప్పుడో – డల్ గా సాగే థ్రిల్లర్ డ్రామా

సమీక్ష : అప్పుడో ఇప్పుడో ఎప్పుడో – డల్ గా సాగే థ్రిల్లర్ డ్రామా

Published on Nov 9, 2024 3:04 AM IST
Appudo Ippudo Eppudo Movie Review in Telugu

విడుదల తేదీ : నవంబర్ 08, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ, రుక్మిణి వసంత్, దివ్యాన్షా కౌశిక్, జాన్ విజయ్, అజయ్, వైవా హర్ష, సత్య తదితరులు

దర్శకుడు : సుధీర్ వర్మ

నిర్మాతలు : బివిఎస్ఎన్ ప్రసాద్

సంగీత దర్శకుడు : కార్తీక్

సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ప్రసాద్

ఎడిటింగ్ : నవీన్ నూలి

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లోకి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ సినిమాల్లో యువ హీరో నిఖిల్ నటించిన సినిమా “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” కూడా ఒకటి. ఎప్పుడో కంప్లీట్ అయ్యిన ఈ సినిమాని సడెన్ గా తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ:

ఇక కథ లోకి వస్తే.. రిషి(నిఖిల్ సిద్ధార్థ్) ఒక రేసర్ కావాలని కలలు కంటాడు. ఆ క్రమంలోనే తొలి చూపు లోనే తారా (రుక్మిణి వసంత్) తో ప్రేమలో పడతాడు కానీ ఒక మిస్ కమ్యూనికేషన్ మూలాన తను లండన్ వెళ్ళిపోతాడు. ఈ క్రమంలో తనకి తులసి అలియాస్ చుంబన(దివ్యాన్షా కౌశిక్) ప్రేమంటూ కలుస్తుంది. మరో పక్క అక్కడే లోకల్ డాన్ అయినటువంటి బద్రి నారాయణ(జాన్ విజయ్) తన రైట్ హ్యాండ్ మున్నా(అజయ్) తో అక్కడే ఇంట్రెస్ట్ కి అప్పు ఇస్తుంటారు. మరి వీరికి కావాల్సిన ఒక డివైస్ మిస్ అవ్వడం అందులోకి రిషి ఎంటర్ కావడం జరుగుతుంది. మరి ఆ డివైస్ ఏంటి? అందులో ఏముంది? రిషి ఏం చేశాడు అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

 

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో నిఖిల్ ఎప్పటిలానే తన యంగ్ లుక్స్ ఈజ్ నటనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. అలాగే కొన్ని సాంగ్స్ లో తన డాన్స్ మూమెంట్స్ కూడా బాగున్నాయి. ఇక తనతో పాటుగా యంగ్ హీరోయిన్ రుక్మిణీ వసంత్ ఈ సినిమా తోనే తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. మరి ఇది మాత్రం తన నుంచి డీసెంట్ డెబ్యూ అనుకోవచ్చు. మంచి లుక్స్ అండ్ నిఖిల్ తో కెమిస్ట్రీ బాగుంది. అలాగే ఇద్దరూ కూడా స్క్రీన్ పై చూసేందుకు బాగున్నారు.

ఇక వీరితో పాటుగా మరో యంగ్ నటి దివ్యాన్షా కౌశిక్ కూడా మంచి పెర్ఫార్మన్స్ చేసింది అని చెప్పొచ్చు. తనకిచ్చిన గ్రే షేడ్ ని బాగా చూపించి ఆకట్టుకుంది. ఇంకా వైవా హర్ష కామెడి బాగుంది. అలాగే కమెడియన్ సత్య, సుదర్శన్ సీన్స్ కూడా బాగున్నాయి. వీరితో పాటుగా నటుడు జాన్ విజయ్, అజయ్ లు తమ రోల్స్ లో బానే చేశారు. ఇంకా కొన్ని ట్విస్ట్ లు కామెడి సీన్స్ పర్వాలేదు.

 

మైనస్ పాయింట్స్:

ఈ సినిమా చాలా కాలం కితమే తీసేసారు కానీ అప్పుడు వచ్చినా కూడా ఇది పూర్తి స్థాయిలో ఎంగేజ్ చేసే రేంజ్ లో ఉండకపోవచ్చు అని చెప్పాలి. మెయిన్ గా నిడివి చిన్నదే అయినప్పటికీ కథనం చాలా స్లో గా బోరింగ్ గా సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఫస్టాఫ్ అయితే ఇంకా దారుణంగా అనిపిస్తుంది.

అలాగే ఇంటర్వెల్ వరకు కూడా సినిమాలో పెద్దగా ఎగ్జైట్ చేసే అంశాలు ఏవీ అంతగా కనిపించవు. నిఖిల్ నుంచి ఆ మధ్య కాలంలోనే ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్స్ ఇచ్చిన హై మూమెంట్స్ ఈ సినిమాలో అయితే లేవని చెప్పొచ్చు. ఇంకా సెకండాఫ్ కొంచెం ఓకే కానీ అందులో కూడా చాలా వీక్ అంశాలు ఉన్నాయి. ఒక్క క్లైమాక్స్ పోర్షన్ మినహా సెకండాఫ్ కూడా డల్ గానే సాగుతుంది.

ఇంకా కొన్ని సీన్స్ లో లాజిక్స్ కూడా బాగోవు. ఇక వీటితో పాటుగా విలన్ పాత్ర మొదట బాగానే చూపించినప్పటికీ తర్వాత అది కాస్తా కామెడీ అయిపోతుంది. ఇంకా ఈ సినిమా కూడా వీరి నుంచి వచ్చిన స్వామి రారా తరహా లోనే రొటీన్ సీన్స్ తో కనిపిస్తుంది ఇలా సినిమా మాత్రం ఒకింత డల్ గా కొనసాగుతుంది..

 

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. మంచి లొకేషన్స్ లో స్టైలిష్ గా సెట్ చేశారు. అలాగే కార్తీక్ మ్యూజిక్ బానే ఉంది కొన్ని సీన్స్ లో సన్నీ ఎమ్ ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టైలిష్ బీట్స్ తో బాగుంది. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. నవీన్ నూలి ఎడిటింగ్ కట్స్ కొన్ని పర్వాలేదు కానీ సినిమాలో పెద్దగా మాటర్ లేకపోవడంతో తను కూడా చేసేది పెద్దగా ఏమి లేకపోయింది.

ఇక దర్శకుడు సుధీర్ వర్మ విషయానికి వస్తే.. ఆల్రెడీ నిఖిల్ తో తనకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ‘స్వామి రారా’ తో ఇద్దరికీ మంచి బ్రేక్ వచ్చింది కానీ ఈ సినిమా కూడా ఒకింత ఆ ఫార్మాట్ లోనే కనిపిస్తుంది. ఒక అప్పుడు ఒక ఐడల్ ఇపుడు ఓ డివైస్ కోసం.. ఇవి కొంచెం రెగ్యులర్ గానే అనిపిస్తాయి. సో ఈ సినిమాలో ఆ మూమెంట్స్ అన్నీ అంత ఎగ్జైట్ చెయ్యవు. అయితే ఎపుడో సినిమాకి ఇప్పుడుకు తగ్గట్టుగా చేసిన కొన్ని చేర్పులు మాత్రం బాగున్నాయి.

 

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” సినిమా రొటీన్ యాక్షన్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది. మెయిన్ లీడ్ బాగున్నారు కొన్ని కామెడీ సీన్స్ వరకు పర్వాలేదు కానీ ఈ సినిమా ఒకింత డల్ అండ్ బోరింగ్ గా సాగుతుంది. నిఖిల్ కోసం ఆడియెన్స్ కోసం దర్శకుడు ఇంకా ఎగ్జైటింగ్ గా ఏమన్నా ప్లాన్ చేయాల్సింది. వీటితో అయితే సినిమా బిలో యావరేజ్ గానే అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు