నందమూరి నటసింహం బాలకృష్ణ ఇపుడు సాలిడ్ లైనప్ తో ఓ రేంజ్ హై ని అభిమానులకి అందిస్తూ తన సినిమాలతో వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలలో తన మాసివ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “అఖండ” హైప్ అయితే ఇంకో లెవెల్ అని చెప్పాలి. దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేసిన ఈ సినిమా మొదటి భాగం బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.
దీనితో పార్ట్ 2 కోసం ఎపుడు నుంచో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రీసెంట్ గానే సినిమాని మేకర్స్ అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేసేసారు. అయితే ఈ సినిమా పనులు ఇపుడు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా థమన్ సాలిడ్ అప్డేట్ అందించాడు. ఈ సినిమా మ్యూజికల్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అని అంతే కాకుండా సినిమాలో ఒక పాట కూడా ఆల్రెడీ పూర్తి చేసేశామని తెలిపాడు. దీనితో ఈ క్రేజీ డివోషనల్ సీక్వెల్ ఫుల్ స్వింగ్ లో దూసుకెళ్తుంది అని చెప్పాలి.