రెండు రోజుల్లో ‘కంగువా’ కలెక్షన్స్ ఎంతంటే?

రెండు రోజుల్లో ‘కంగువా’ కలెక్షన్స్ ఎంతంటే?

Published on Nov 16, 2024 10:00 PM IST

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర మిక్సిడ్ టాక్ లభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ఇక సూర్య కూడా ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడ్డాడు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా వరల్డ్‌వైడ్‌గా భారీ అంచనాల మధ్య రిలీజ్ చేశారు.

ఇక ఈ సినిమా తొలిరోజే 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఈ కలెక్షన్ల జోరు రెండోరోజు కూడా కొనసాగింది. ఈ సినిమా రెండు రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.89.32 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మూవీకి వీకెండ్‌లో వసూళ్లు మరితంగా పెరిగే అవకాశం ఉందని మేకర్స్ అంటున్నారు.

ఈ సినిమాలో సూర్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించగా దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు