‘కంగువా’ టాక్ పై జ్యోతిక క్రేజీ కామెంట్స్

‘కంగువా’ టాక్ పై జ్యోతిక క్రేజీ కామెంట్స్

Published on Nov 17, 2024 7:00 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “కంగువా”. అయితే, ‘కంగువా’కు మిక్స్‌డ్ టాక్ వస్తున్న వేళ సూర్య భార్య జ్యోతిక ఈ సినిమా టాక్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కంగువా మూవీ తొలి అర గంట నిజంగానే బాలేదు. ముఖ్యంగా సౌండ్ ఇబ్బందికరంగా ఉంది. అది మినహాయిస్తే ఈ సినిమా నిజంగా ఒక అద్భుతం. సూర్య నటన, కెమెరా వర్క్ గొప్పగా ఉంది. నాకు సినిమా చాలా బాగా నచ్చింది. నెగటివ్ రివ్యూస్ చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. రొటీన్ స్టోరీస్, అమ్మాయిల వెంట పడటం, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌ను దాటి వారి మెదడు ఎదగలేదని అర్థమవుతోంది’ అంటూ జ్యోతిక చెప్పడం విశేషం.

ఇక సినిమా విషయానికి వస్తే.. సూర్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాలు నడుమ పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం రిలీజ్ కి వచ్చింది. అయితే, ఈ సినిమా వరల్డ్ వైడ్ డీసెంట్ ఓపెనింగ్స్ ని కూడా అందుకుంది. ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలకి హిందీ వసూళ్ళు కూడా ఒకింత కీలకంగా మారిన సంగతి తెలిసిందే. అలా తమిళ్ నుంచి వెళ్లిన సినిమాల్లో మంచి వసూళ్లనే కంగువా అందుకున్నట్టు తెలుస్తోంది. తమిళ పి ఆర్ లెక్కల ప్రకారం కంగువా మొదటి రోజు 3.55 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టు తెలుస్తోంది. ఇది మాత్రం సూర్య మొదటి ప్రయత్నం లోనే మంచి నంబర్ అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు