దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా జనవరి మూడో వారం తర్వాత రెగ్యలర్ షూటింగ్ కి వెళ్తుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ దిశగా రాజమౌళి అండ్ కో పనిచేస్తోందని కూడా చెప్పారు. ఐతే, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పై మరో వార్త వినిపిస్తోంది. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందట. ప్రస్తుతం వర్క్ షాపులు నిర్వహిస్తున్నారట. అన్నట్టు ఇప్పటికే రాజమౌళి ఈ సినిమా స్క్రిప్ట్ పై పకడ్బందీగా వర్క్ చేస్తున్నారట. మొత్తానికి ఈ సినిమా పై ఏదొక రూమర్ వైరల్ అవుతూనే ఉంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో ప్రముఖ ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ హీరోయిన్ పాత్రలో నటిస్తోందని పుకార్లు వినిపించాయి. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. కాగా ఆ మధ్య విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుంది.