బాలీవుడ్ స్టార్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకుంటున్న వార్త చాలా రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ఈ వార్తల నేపథ్యంలో భార్య ఐశ్వర్యరాయ్‌పై బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అభిషేక్ ఏం మాట్లాడారు అంటే.. ‘నేను బయటకు వెళ్లి సినిమాలు చేయగలుగుతున్నా అంటే ఇంట్లో ఐశ్వర్య ఉందన్న ధైర్యమే. అందుకు నేను అదృష్టవంతుడిని. ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పిల్లలు కూడా తండ్రిని మూడో వ్యక్తిగా చూడరు. ఎందుకంటే వారికి పేరెంట్స్ ఇద్దరూ ఒక్కటే’ అని అభిషేక్ చెప్పుకొచ్చారు.
మొత్తానికి వీరి విడాకుల వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే అని చెప్పడానికి మరో ఉదాహరణ కూడా ఉంది. ఐశ్వర్యారాయ్ కి సోషల్ మీడియాలో పాపులారిటీ ఎక్కువ. పైగా ఐశ్వర్య రాయ్ ని 14.3 మిలియన్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. మరి ఐశ్వర్య రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవర్ని ఫాలో అవుతుందో తెలుసా ?, కేవలం 1 వ్యక్తిని మాత్రమే ఆమె అనుసరిస్తోంది. ఆ వ్యక్తి తన భర్త అభిషేక్ బచ్చనే. కాబట్టి, వీరి విడాకుల వార్తలు రూమర్స్ అని అర్ధం అవుతుంది. ఈ రకంగా తమపై వస్తున్న విడాకాల రూమర్స్ గురించి ఐశ్వర్య క్లారిటీ ఇచ్చారు.