గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందే, రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీని దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే లాంచ్ అయిన ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవల స్టార్ట్ చేశారు.
అయితే, ఈ సినిమా కోసం రామ్ చరణ్ బాడీ బిల్డ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఈ సినిమా కోసం రామ్ చరణ్ సరికొత్త మేకోవర్‌తో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. చరణ్ కొత్త లుక్‌ను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ డిజైన్ చేస్తున్నాడు. ఈ మేరకు మేకోవర్ అవుతున్న ప్రీ-లుక్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇక ఈ లుక్ మాసివ్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఎలాంటి లుక్‌లోకి వస్తున్నాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Global Star @AlwaysRamCharan Garu gets a solid makeover by @AalimHakim Ji for #RC16
A never seen before massive look loading ????????????#RamCharanRevolts
@NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @IamJagguBhai @arrahman @RathnaveluDop @artkolla @vriddhicinemas @SukumarWritings… pic.twitter.com/UH1rLHiz8P— Mythri Movie Makers (@MythriOfficial) November 25, 2024