అక్కినేని ఫ్యామిలీ నాగచైతన్య పెళ్లి దగ్గరపడుతుండటంతో సంతోషంగా ఉన్నారు. అందాల భామ శోభిత ధూళిపాళతో చైతన్య పెళ్లి జరుగుతుండటంతో ఇరు కుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇక ఈ పెళ్లిని చాలా సింపుల్‌గా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు రెడీ అవుతున్నారు. అయితే, ఇప్పుడు అక్కినేని ఇంట్లో మరో శుభకార్యం కూడా జరిగింది.
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నిశ్చితార్థం సన్నిహితుల మధ్య జరిగినట్లుగా అక్కినేని నాగార్జున తాజాగా ప్రకటించాడు. జైనబ్ రావడ్జితో అఖిల్ నిశ్చితార్థం జరిగినట్లుగా నాగార్జున వెల్లడించాడు. ఇరు కుటుంబాల సభ్యుల సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక జరిగిందని.. జైనబ్‌ని కోడలిగా తమ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నామని.. ఆమె రాక తమకు మరింత సంతోషాన్ని కలిగించిందని నాగార్జున తెలిపాడు.
ఇలా సైలెంట్‌గా అఖిల్ నిశ్చితార్థం చేసుకోవడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే, ఓ వైపు చైతూ-శోభిత పెళ్లి పనులు వేగంగా జరుగుతుండగా.. ఇప్పుడు అఖిల్ కూడా నిశ్చితార్థం చేసుకోవడంతో అక్కినేని అభిమానులకు డబుల్ ట్రీట్ లభించిందని చెప్పాలి.