“ఓజి” లో ఊహించని సర్ప్రైజ్ ఖాయమేనా!?

“ఓజి” లో ఊహించని సర్ప్రైజ్ ఖాయమేనా!?

Published on Nov 30, 2024 10:30 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు చేస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో దర్శకుడు సుజీత్ తో చేస్తున్న భారీ చిత్రం “ఓజి” కూడా ఒకటి. మరి దీనిపై స్పెషల్ అంచనాలు ఆల్రెడీ ఉన్నాయి. ఇక ఈ బిగ్గెస్ట్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇంకా పవన్ లాస్ట్ డేట్స్ ఇస్తే సుజీత్ అండ్ టీం త్వరగా సినిమాని ఫినిష్ చేసేయాలని ఫిక్స్ అయ్యి ఉన్నారు. అయితే ఒక క్రేజీ బజ్ ఇపుడు “ఓజి” విషయంలో వినిపిస్తుంది.

ఆల్రెడీ గతంలో ఈ సినిమాకి సుజీత్ అండ్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం సాహో కి లింక్ ఉన్నట్టుగా పలు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇపుడు కొత్త రూమర్ ఏమిటంటే ఓజి క్లైమాక్స్ ఓ స్టార్ హీరో ఎంటర్ అవుతాడు అని మొదలైంది. దీనితో ఎలాగో సాహో సినిమాతో రూమర్స్ ఉన్నాయి కాబట్టి అది ప్రభాసేనా అనే ఉత్కంఠ ఇపుడు నెలకొంది. మరి ఆ క్రేజీ సర్ప్రైజ్ ఏంటి ఎవరు అనేది మాత్రం డెఫినెట్ గా వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు