మలయాళ సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న చిత్రాలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే నటుడు ఫహాద్ ఫాజిల్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘బౌగెన్‌విల్లా’ మూవీ కూడా తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. డిసెంబర్ 13 నుంచి సోనీ లివ్‌లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రాబోతుంది. అసలు ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భార్యాభర్తలు కారులో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో భార్య గతం మర్చిపోతుంది. ఆ తర్వాత ఆమె జీవితం మారిపోతుంది.
ఐతే, ఆ ప్రమాదానికి కారణం ఎవరు ?, అసలు ఆ ప్రమాదానికి ముందు ఆమెను ఓ అమ్మాయి ఎందుకు ఫాలో అయ్యింది ?, ఆ తర్వాత అమ్మాయి ఎందుకు మిస్సయ్యింది ? ఈ మొత్తం కథలో ఫహాద్ ఫాజిల్ పాత్ర ఏమిటి ? అనేది మిగతా కథ. సహజంగా ఫహాద్ ఫాజిల్ సినిమాల్లో మంచి కంటెంట్ ఉంటుంది. కాబట్టి, ‘బౌగెన్‌విల్లా’ మూవీ పై ఓటీటీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి.