ఆ నటుడిపై లైంగిక వేధింపుల కేసు

ఆ నటుడిపై లైంగిక వేధింపుల కేసు

Published on Dec 1, 2024 7:00 AM IST

జస్టిస్‌ హేమ కమిటీ రూపొందించిన నివేదిక ఆ మధ్య హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మలయాళ సినీ రంగంలో పలువురు నటీమణులు లైంగిక ఆరోపణలు చేస్తూ సంచలన విషయాలను బయట పెట్టారు. ఈ క్రమంలో కొందరు నటులు, నిర్మాతల నిజ స్వరూపం బయట పడింది. అయితే, తాజాగా లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడు శరద్ కపూర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఓ సినిమా విషయమై ఈనెల 26న ఆయన తనను ఇంటికి పిలిచి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని 32 ఏళ్ల మహిళ ముంబైలోని ఖర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు చేయడంతో.. శరద్ కపూర్‌పై BNS 4, 75, 79 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పైగా విచారణకు రావాలని శరద్ కపూర్ కి సమన్లు కూడా జారీ చేశారు. కాగా శరద్ కపూర్ జోష్, కార్గిల్ LOC, లక్ష్య తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక ఈ కేసు ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు