‘అఖండ 2’లో మరో సీనియర్ హీరో ?

‘అఖండ 2’లో మరో సీనియర్ హీరో ?

Published on Dec 1, 2024 7:59 AM IST


నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. కాగా తాజాగా ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా కనిపించబోతున్నాడని.. ఆ హీరోది నెగిటివ్ రోల్ అని టాక్ నడుస్తోంది. నిజానికి ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతునట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు సంజయ్ దత్ తో పాటు మరో సౌత్ హీరో కూడా ఉంటాడని టాక్.

మొత్తానికి ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక పై దర్శకుడు బోయపాటి దృష్టి పెట్టారు. ఆల్ రెడీ, ఇప్పటికే పలు కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను తీసుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు