అదే నేను చేసిన పెద్ద తప్పు – రకుల్

అదే నేను చేసిన పెద్ద తప్పు – రకుల్

Published on Dec 2, 2024 8:02 AM IST

హీరోయిన్ ‘రకుల్ ప్రీత్ సింగ్’ రీసెంట్ గా గాయపడింది. ఐతే, తన యాక్సిడెంట్ పై పూర్తిస్థాయిలో రకుల్ తాజాగా స్పందించింది. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇంతకీ రకుల్ ఏం చెప్పింది అంటే.. ఆమె మాటల్లోనే విందాం. ‘అది అక్టోబర్ 5, ఆ రోజు నేను మరిచిపోలేని రోజు. ఎప్పట్లానే జిమ్ కు వెళ్లాను. 80 కిలోలు లిఫ్టింగ్ చేశాను. దాంతో సడెన్ గా నా వెన్నెముకలో నొప్పి వచ్చింది. కానీ, ఆ నొప్పిని నేను పెద్దగా పట్టించుకోలేదు. అదే నేను చేసిన పెద్ద తప్పు’ అని రకుల్ చెప్పింది.

ఈ విషయం గురించి రకుల్ ఇంకా మాట్లాడుతూ.. ‘నాకు ఆ నొప్పి ఉన్నా.. నేను నేరుగా షూటింగ్ కు వెళ్లాను. రాత్రి ఇంటికొచ్చేసరికి వంగలేకపోయాను. ఓ దశలో నా దుస్తులు కూడా నేను మార్చుకోలేకపోయాను. ఆ తర్వాత నాలుగు రోజులకు సడన్ గా నా నడుము నుంచి కింది భాగం మొత్తం మొద్దుబారిపోతుంది. ఒక్కసారిగా నా బీపీ కూడా పడిపోయింది. అంతే ఆ దెబ్బతో స్పృహ తప్పిపోయాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది’ అని రకుల్ చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు