టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, మేకింగ్ వీడియోలు మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.
ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘గోదారి గట్టు’ని మేకర్స్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. డిసెంబర్ 3న ఉదయం 11.07 గంటలకు ఈ సాంగ్‌ని రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పాటను పాపులర్ సింగర్ రమణ గోగుల చాలా గ్యాప్ తరువాత పాడుతుండటంతో ప్రేక్షకుల్లో ఈ పాటపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఇక ఆయనతో పాటు సింగర్ మధుప్రియ కూడా ఈ పాటను పాడింది.
ఈ పాటలో ఐశ్వర్య రాజేష్, వెంకటేష్‌ల రొమాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.