స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
అయితే, తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘గోదారి గట్టు’ అనే పాటను రిలీజ్ చేశారు. భాస్కరభట్ల రచించిన ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో చక్కటి సంగీతాన్ని అందించాడు. ఇక ఈ పాటను ప్రముఖ సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల చాలా కాలం తరువాత పాడటంతో ఈ పాట రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. తనదైన మార్క్ వాయిస్‌తో ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాడు రమణ గోగుల. ఆయనతో పాటు మధుప్రియ కూడా చక్కగా పాడింది.
సినిమాలో ఈ పాటను విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్‌లపై చిత్రీకరించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని ఈ లిరికల్ వీడియో సాంగ్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్, దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 14న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి