2024లో రెబల్ స్టార్ హల్‌చల్.. దద్దరిల్లిన గూగుల్!

2024లో రెబల్ స్టార్ హల్‌చల్.. దద్దరిల్లిన గూగుల్!

Published on Dec 11, 2024 3:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే తెలుగులోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ నెలకొంటుందో అందరికీ తెలిసిందే. ఆయన ఓ సినిమా చేశాడంటే, అది ఖచ్చితంగా పాన్ ఇండియన్ మూవీగా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. ఇక ఇటీవల ప్రభాస్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.

ఆయన నటించిన లాస్ట్ మూవీ ‘కల్కి 2898 ఎడి’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఇక 2024లో ప్రముఖ ఆన్‌లైన్ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్ సెర్స్’లో రెబల్ స్టార్ మేనియా కొనసాగింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. 2024లో ప్రభాస్‌కి సంబంధించిన సినిమాల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది సలార్, కల్కి చిత్రాలు అని గూగుల్ తెలిపింది.

ఈ విషయం తెలియడంతో రెబల్ స్టార్ మేనియాకు గూగుల్ దద్దరిల్లిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు