నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెడుతూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన ‘డాకు మహారాజ్’ చిత్ర షూటింగ్‌ను ముగించుకుని.. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, మాస్ చిత్రాల స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బ్లాక్‌బస్టర్ మూవీ ‘అఖండ’కు సీక్వెల్‌గా ‘అఖండ-2 తాండవం’ను ప్రారంభించాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ సినిమా నుండి తాజాగా మేకర్స్ ఓ బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ‘అఖండ-2 తాండవం’ రిలీజ్ డేట్‌కి సంబంధించిన ప్రోమోను వారు తాజాగా రిలీజ్ చేశారు.
అఖండ-2 చిత్రాన్ని వచ్చే దసరా కానుకగా 2025 సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ఇక ఈ అప్డేట్‌తో ‘అఖండ-2’ తాండవం ముహూర్తం షాట్‌లో బాలయ్య చెప్పిన పవర్‌ఫుల్ డైలాగును జోడించడంతో ఈ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో అందాల భామ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా థమన్ సంగీత అందిస్తున్నాడు. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తు్న్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి