హీరో అల్లరి నరేష్ అప్‌కమింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బచ్చల మల్లి’. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తుంది. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అమృత అయ్యర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
బచ్చలమల్లి ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారు?
‘హనుమాన్’ షూట్ చేస్తున్నపుడు ఈ కథ విన్నాను. స్క్రిప్ట్, క్యారెక్టర్ చాలా నచ్చింది. ఇందులో క్యారెక్టర్‌కి కథలో చాలా ఇంపార్టెన్స్ ఉంది.
ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
80ల బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది. టౌన్ అమ్మాయి అయినప్పటికీ సిటీ కల్చర్ ఉన్న క్యారెక్టర్లో కనిపిస్తాను. తను చాలా సెన్సిటివ్, వెరీ ఎమోషనల్ క్యారెక్టర్. ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయి. ఇందులో నాకు, నరేష్ గారి మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఇప్పటివరకూ నేను చేసిన క్యారెక్టర్స్‌కి డిఫరెంట్ గా ఉంటుంది.
నరేష్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
నరేష్ గారు అద్భుతమైన యాక్టర్. ఎలాంటి ఎమోషనైనా పండించగలరు. అన్ స్క్రీన్ అగ్రెసివ్ క్యారెక్టర్ ఉంటుంది. కానీ అఫ్ స్క్రీన్ ఆయన చాలా సాఫ్ట్ పర్శన్. చాలా ఫ్రెండ్లీ. ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్.
డైరెక్టర్ సుబ్బు గారి గురించి?
సుబ్బు గారు చాలా క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్. చాలా ఫోకస్‌గా ఉంటారు. ఎమోషన్స్ ని చాలా అద్భుతంగా తీశారు. బచ్చల మల్లి ఎమోషనల్ డ్రామా. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది.
బచ్చల మల్లి మ్యూజిక్ గురించి?
సీతారామం ఫేం విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమా మ్యూజిక్. ఆయన మ్యూజిక్ ఇస్తున్నారు అనగానే చాలా ఆనందంగా అనిపించింది. ఇందులో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సినిమా రిలీజ్ తర్వాత మరింతగా కనెక్ట్ అవుతాయి.
నిర్మాతల గురించి?
రాజేష్ దండా గారితో ఇదివరకే ఓ సినిమా చేయాలి. కానీ అది కుదరలేదు. ఫైనల్‌గా ఈ సినిమాలో పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. సినిమా అంటే చాలా పాషన్ ఉన్న ప్రొడ్యూసర్. వారి ప్రొడక్షన్లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీ జర్నీ చాలా స్మూత్‌గా జరిగింది.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
ఓ కన్నడ, తమిళ్ సినిమా చేస్తున్నాను. తెలుగులో స్క్రిప్ట్స్ వింటున్నాను.