మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన రీసెంట్ మూవీ ‘లక్కీ భాస్కర్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమా కథ, దానికి తగ్గట్టుగా ఉన్న స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను థ్రిల్ చేశాయి. బ్యాంక్ ఫ్రాడ్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది.
ఇక రీసెంట్‌గా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. ఈ సినిమాకు నెట్‌ఫ్లిక్స్‌లోనూ సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. రెండు వారాలుగా ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రెండో స్థానంలో గ్లోబల్ ట్రెండ్ అవుతోంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు ఏకంగా 17.8 బిలియన్ మినట్స్ వ్యూస్ దక్కినట్లుగా నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది.
ఇలా థియేటర్స్‌లోనే సత్తా చాటిన ‘లక్కీ భాస్కర్’, ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకు పోతుండటంతో అభిమానులు, మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.